మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి

ABN , First Publish Date - 2020-11-29T05:28:07+05:30 IST

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి
కర్నూలులో టీడీపీ కార్యాలయంలో నివాళి అర్పిస్తున్న నాయకులు

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని శనివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు.



కర్నూలు(ఎడ్యుకేషన్‌)/ కర్నూలు(న్యూసిటీ)/ కర్నూలు(అగ్రికల్చర్‌)/ గూడూరు/  సి.బెళగల్‌/ ఆదోని/ ఆదోని రూరల్‌/ ఆదోని టౌన్‌/ డోన్‌(రూరల్‌)/ బేతంచెర్ల/ ఎమ్మిగనూరు టౌన్‌/పెద్దకడుబూరు/గోనెగండ్ల/ నందవరం, నవంబరు 28:

 బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని టీడీపీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి కాల్వ శ్రీనివాసులు, కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, అనంతపురం, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్త ప్రభాకర్‌ చౌదరి అన్నారు. కర్నూలులో టీడీపీ కార్యాలయంలో పూలే వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌ పాల్గొన్నారు.


 కర్నూలు నగరంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌, ప్రదాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.


 కర్నూలులో బిర్లాగేటు దగ్గర ఉన్న   పూలే విగ్రహానికి బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామశేషయ్య, రాష్ట్ర ప్రతినిధి ఆనంద్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. నాగార్జున, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


 కర్నూలు బిర్లా గేట్‌ వద్ద ఉన్న మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ పాల్గొన్నారు

.

 వైసీపీ కర్నూలు నగర పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. 24 ఫౌండేషన్‌ రాయలసీమ సమన్వయకర్త కేదార్‌నాథ్‌, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ఆసిఫ్‌, కరుణాకర్‌రెడ్డి, నాయకళ్లు ప్రసాద్‌ పాల్గొన్నారు.


 ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలులో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నివాళి అర్పించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి గురుశేఖర్‌, గోవింద్‌, జయమ్మ, శేషాద్రి, శాంతయ్య పాల్గొన్నారు.


 జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


 వైసీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నివాళి అర్పించారు. పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రియల్‌ టైమ్‌నాగరాజు, కృష్ణకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 ఆదోనిలోని టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావుపూలే వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధారెడ్డి, వీఎం గోపాల్‌ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు మాట్లాడుతూ నవనిర్మాణ వెనుకబడిన జాతుల వారి కోసం పోరాటం చేసిన సమరయోధుడు మహాత్మజ్యోతిరావుపూలే అని కొనియాడారు. కల్లుబావి మల్లికార్జున, అంజుగాంధీ, వీరేష్‌, రామలింగ, ఈరన్న, శ్రీనివాస్‌గౌడ్‌, బాలాజీ, రామకృష్ణ, రంగనాయకులు పాల్గొన్నారు.


 ఆదోనిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో పూలే వర్ధంతి నిర్వహించారు. బసవరాజస్వామి, నీలకంఠప్ప, ఎండీ బద్రీనాథ్‌స్వామి, గోవిందరావు, కుమారస్వామి, షేక్షావలి, ఈరన్నగౌడ్‌, ఫయాజ్‌, రాముడు పాల్గొన్నారు. 


 ఆదోనిలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాకరే రాఘవేంద్ర, పట్టణ అధ్యక్షుడు సాయికుమార్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆధూరి విజయకృష్ణ, ఏబీసీ మోర్చా జిల్లా నాయకుడు ఉరుకుందగౌడ్‌, యువమోర్చా అధ్యక్షుడు అంజయ్‌, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నాగార్జున, కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కురువ వెంకటేశ్‌, మహేష్‌నాయక్‌, నాగేష్‌ పాల్గొన్నారు.

 

 ఆదోనిలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీలకంఠప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మారుతిరావు, నూర్‌నిజామి, దిలీప్‌ధోకా, తాయన్న, జయరాం పాల్గొన్నారు. 


 డోన్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం రంగనాయకులు, మల్లికార్జున, నాగరాజు, సుధాకర్‌, రామనాయుడు, గోవింద్‌ పాల్గొన్నారు.


బేతంచెర్ల పట్టణంలో వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. వడ్డెర యూత్‌ కమిటీ అధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు, వెంకటరాముడు, రమణ, మధు, యువ రాజు, రమేష్‌, శ్రీనివాసులు, వడ్డెరలు పాల్గొన్నారు.


 ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శనివారం జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి పూలే చిత్రపటానికినివాళి అర్పించారు. బుట్టా శారదమ్మ, బుట్టారంగయ్య, సునీల్‌కుమార్‌, నజీర్‌అహ్మద్‌ పాల్గొన్నారు. సామాజిక న్యాయపోరాట సమితి, బీసీ సంఘం ఆద్వర్యంలో నాయకులు ఎరుకల కృష్ణ, గణేష్‌ బతకన్న, వీరేష్‌, శీను, మల్లికార్జున నివాళి అర్పించారు. ఆర్‌ఏవీఎఫ్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా, కృష్ణ వెంకటేష్‌, వీరేష్‌, మంజు పాల్గొన్నారు. 


 పెద్దకడుబూరులో వైసీపీ నాయకుడు అర్లప్ప, బొగ్గుల తిక్కన్న బొడ్డన్న, జీవన్‌, తిక్కన్న, దుర్గప్ప నివాళి అర్పించారు.


 గోనెగండ్ల కింది వీధిలో బీసీ సంఘం నాయకులు నివాళి అర్పించారు. సంఘం మండల అధ్యక్షుడు పులికొండ నాయుడు, మల్లికార్జున గౌడ్‌, ఓబిలేష్‌, ధర్మన్నగౌడ్‌, కడపల వెంకటేష్‌, చాకలి కుమార్‌, పూజారిరంగస్వామి, కుమ్మరి మునిస్వామి పాల్గొన్నారు. 


 నందవరం టైలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వలి ఆధ్వర్యంలో శనివారం జ్యోతిరావు పూలే 130వ వర్థంతి జరుపుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘంకన్వీనర్‌ ఫకృద్దీన్‌బాషా, భీమశేఖర్‌, ఫొటోగ్రాఫర్‌ అసోసియేషన్‌ నాయకులు కొదండపాణి, టీడీపీ నాయకులు గడ్డం నాగన్న, నజీర్‌ అహ్మద్‌, కృష్ణ, చంద్ర, సమర, కోటేకల్‌ ఖాజ పాల్గొన్నారు.


 గూడూరు నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం కోడుమూరు తాలుకా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ ఎల్‌.వెంకటేశ్వర్లు, కమిషనర్‌ పవన్‌కుమార్‌ రెడ్డి, నాయకులు అస్లాం, సుభాకర్‌, ప్రవీణ్‌, ప్రతాప్‌, దస్తగిరి, ఉగ్ర నరసింహులు, డ్రైవర్‌ మద్దిలేటి, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

 

 సి.బెళగల్‌ మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ భవనంలో ఎంపీడీవో రాముడు, తహసీల్దార్‌ శివశంకర్‌నాయక్‌ జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:28:07+05:30 IST