రాష్ర్టానికి మంచిపేరు తేవాలి

ABN , First Publish Date - 2022-08-20T05:23:56+05:30 IST

క్రీడాకారులందరూ టీమ్‌ స్పిరిట్‌తో ఆడి రాష్ట్రానికి మంచిపేరు తేవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, బాస్కెట్‌బాల్‌ మాజీ క్రీడాకారులు జస్టిస్‌ జి.సురేష్‌రెడ్డి సూచించారు.

రాష్ర్టానికి మంచిపేరు తేవాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న హైకోర్టు జడ్జి జస్టిస్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు

హైకోర్టు జడ్జి జస్టిస్‌ సురేష్‌రెడ్డి 

గుంటూరు(క్రీడలు), ఆగస్టు 19: క్రీడాకారులందరూ టీమ్‌ స్పిరిట్‌తో ఆడి రాష్ట్రానికి మంచిపేరు తేవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, బాస్కెట్‌బాల్‌ మాజీ క్రీడాకారులు జస్టిస్‌ జి.సురేష్‌రెడ్డి సూచించారు. గుంటూరు జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియంలో 8వ రాష్ట్రస్థాయి సీనియర్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ టోర్నమెంట్‌ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌రెడ్డి తన సతీమణితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బాస్కెట్‌బాల్‌ కేవలం క్రీడ మాత్రమే కాదన్న ఆయన ఆరోగ్యంతో పాటు జీవన గమనాన్ని కూడా నిర్దేశిస్తుందన్నారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయ జోక్యం, సిఫార్సులను సహించే ప్రసక్తేలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రేవతి, ఆంజనేయులు, సీనియర్‌ క్రీడాకారులు శేకరరెడ్డి, హరిగోపాల్‌ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. 

రెండో రోజు ఫలితాలు

పురుషుల విభాగంలో కర్నూలు జట్టు 38-35 స్కోరుతో నెల్లూరుపై, కృష్టా జట్టు 57-26 స్కోరుతో ప్రకాశంపై, శ్రీకాకుళం 34-17 విజయనగరంపై, ఈస్ట్‌ గోదావరి 79-48 అనంతపురంపై విజయం సాధించాయి. 

 

Updated Date - 2022-08-20T05:23:56+05:30 IST