సిమ్లా: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షాకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ట్వీట్ ద్వారా తెలిపారు. ఎంఆర్ షా గతంలో పాట్నా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఆయన సుప్రీంకోర్టు నుంచి రిటైర్ కానున్నారు.