శ్రీనివాస్‌ పరిష్కారాలలో శాస్త్రీయ దృక్పథం : జస్టిస్‌ చంద్రయ్య

ABN , First Publish Date - 2021-02-25T06:54:37+05:30 IST

సమాజ సమస్యలకు కె..శ్రీనివాస్‌ తన సంపాదకీయ వ్యాసాల ద్వారా ఇచ్చే పరిష్కారాలు శాస్త్రీయ దృక్పథంతో ఉంటాయని, సమాజ సమస్యలకు పరిష్కారాలు

శ్రీనివాస్‌ పరిష్కారాలలో శాస్త్రీయ దృక్పథం : జస్టిస్‌ చంద్రయ్య
కె.శ్రీనివా్‌సకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న జస్టిస్‌ చంద్రయ్య తదితరులు

 తెలుగు భాషకు అంత ప్రమాదం ఏమీలేదు.. గొప్పగా కొనసాగుతుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ 


చిక్కడపల్లి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): సమాజ సమస్యలకు కె..శ్రీనివాస్‌ తన సంపాదకీయ వ్యాసాల ద్వారా ఇచ్చే పరిష్కారాలు శాస్త్రీయ దృక్పథంతో ఉంటాయని, సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపే జ్ఞాని ఆయన అని తెలంగాణ మానవహక్కుల కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి సంపాదకులు, ప్రముఖ విమర్శకులు కె.శ్రీనివా్‌సకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారం ప్రదాన కార్యక్రమం బుధవారం సాయంత్రం త్యాగరాయగానసభలో కళానిలయం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ తెలుగుభాషకు చేస్తున్న సేవ ఎంతో గొప్పదన్నారు. ఆయన చక్కటి పరిశోఽధకులని, ఇది తెలుగువారందరూ కలిసి ఇస్తున్న పురస్కారంగా భావిస్తున్నానన్నారు. తెలుగు భాష మన ఉనికికే మూలం అని, తన రచనల ద్వారా తెలుగుకే తెలుగు నేర్పిస్తున్న వారు శ్రీనివాస్‌ అని ప్రశంసించారు.

కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషకు ప్రమాదం ఉన్న మాట నిజమే అయినా తెలుగుభాషకు మాత్రం ఆ ప్రమాదం లేదన్నారు. తెలుగు భాష అన్ని దాడులను తట్టుకుని నిలబడిందని, ఇప్పుడు కూడా నిలబడుతుందన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో జల్లెడ పట్టాల్సిన వ్యవస్థలు పనిచేయలేకపోవడం బాధాకరమన్నారు. 150, 160 ఏళ్ల కిందట దక్షిణాఫ్రికా, మారిషస్‌ వెళ్లినవారు కూడా తెలుగును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తెలుగు భాష గొప్పగా కొనసాగుతుందని, తెలుగు ఉంటుంది, తెలుగు కొనసాగుతుందని వివరించారు.

ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. జనజీవన భాషను ప్రామాణిక భాషగా మార్చి జీవనదిలా ప్రవహిస్తున్న వారు కె.శ్రీనివాస్‌ అన్నారు. తెలుగుజాతిని కాపాడే ప్రముఖ పాత్రికేయుల్లో శ్రీనివాస్‌ ఒకరన్నారు. ఆలోచనాత్మకంగా చెప్పగల విశిష్టత కలిగి తెలంగాణ సంస్కృతి మూలాలు బాగా తెలిసినవారు శ్రీనివాస్‌ అని పేర్కొన్నారు. ఆయన రాసే కాలమ్స్‌ అందరి ఆమోదాన్ని పొందుతాయని, బహుజనవాదులు, దళితవాదులు, మైనార్టీవాదులకు అత్యంత ఆప్తులు శ్రీనివాస్‌ అని వివరించారు. జనజీవన భాషకు ప్రతినిధిగా శ్రీనివా్‌సను ఈ పురస్కారానికి ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.

అధ్యక్షత వహించిన ప్రముఖ గాయని హైమవతి భీమన్న బోయి మాట్లాడుతూ.. సంపాదకుడిగా, రచయితగా, విమర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీనివాస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంపట్ల హర్షం ప్రకటించారు. సమావేశంలో నృత్యగురువు ఎస్‌.పి.భారతి, వైఎ్‌సఆర్‌ మూర్తి, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, కొత్త శ్రీనివాస్‌, యేబూషి యాదగిరి, నిర్వాహకులు ఎ.సురేందర్‌, పుష్పలత, దయాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. 




Updated Date - 2021-02-25T06:54:37+05:30 IST