జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం 318.516 మీటర్లు

ABN , First Publish Date - 2020-10-19T15:11:05+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా...ప్రస్తుతం నీటిమట్టం 315.570 మీటర్లకు చేరింది.

జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం 318.516 మీటర్లు

మహబూబ్‌నగర్:  జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516మీటర్లు కాగా...ప్రస్తుతం నీటిమట్టం 315.570 మీటర్లకు చేరింది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 4.567 టీఎంసీలకు గాను.. పూర్తిస్థాయి 9.657 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అధికారులు ప్రాజెక్ట్ 36 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3,86,000క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,89,209 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-10-19T15:11:05+05:30 IST