Abn logo
Jul 26 2021 @ 07:47AM

జూరాలకు భారీగా వరద

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 44 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం: 316.550 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ:  6.019 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో  3,86,000 క్యూసెక్కులు, మొత్తం ఔట్ ఫ్లో 4,04,042 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. దిగువకు శ్రీశైలం వైపు 4,02,463 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.