1 నుంచి కాట్పాడి రైలు వంతెనపై రాకపోకలు బంద్‌

ABN , First Publish Date - 2022-05-19T15:13:45+05:30 IST

స్థానిక కాట్పాడిలో తమిళనాడు-ఆంధ్ర రాష్ట్రాలను కలిపేలా రైల్వే వంతెన ఉంది. మరమ్మతుపనుల కారణంగా జూన్‌ 1వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను నిషేధిస్తున్నట్లు

1 నుంచి కాట్పాడి రైలు వంతెనపై రాకపోకలు బంద్‌

వేలూరు(చెన్నై): స్థానిక కాట్పాడిలో తమిళనాడు-ఆంధ్ర రాష్ట్రాలను కలిపేలా రైల్వే వంతెన ఉంది. మరమ్మతుపనుల కారణంగా జూన్‌ 1వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో వేలూరు నుంచి ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు వైపునకు వెళ్లే వాహనాలు సేర్కాడు, దక్షిణ జిల్లాల నుంచి తిరువణ్ణామలై మీదుగా వెళ్లే వాహనాలు పోలూరు, ఆరణి, ఆర్కాడు, రాణిపేట, సేర్కాడు మీదుగా, కృష్ణగిరి నుంచి చిత్తూరు వెళ్లే వాహనాలు పల్లికొండ, గుడియాత్తం వైపుగా వెళ్లాలని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-19T15:13:45+05:30 IST