Abn logo
Aug 1 2021 @ 23:52PM

సివిల్‌ జడ్జి జ్యోత్స్నకు సన్మానం

పద్మారావునగర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ గాంధీనగర్‌ కాలనీకి చెందిన గుంటి శంకర్‌రావు కుమార్తె జ్యోత్స్న బీటెక్‌ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేట్‌ ఉద్యోగం చేశారు. హైకోర్టు తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమెను న్యాయవాదులు డి.ప్రవీణ్‌ కుమార్‌, గుంటి మల్లిఖార్జున్‌, బీజేపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వై.శ్రీనివాస్‌, శివరామకృష్ణ, సురేష్‌ కుమార్‌, పులి భాస్కర్‌, నర్సింగ్‌రావు, సురేష్‌ సన్మానించారు.  

హైదరాబాద్మరిన్ని...