Abn logo
Nov 29 2020 @ 00:53AM

ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి

గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మొగలిచెండు సురేశ్‌


పాడేరురూరల్‌, నవంబరు 28: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మొగలిచెండు సురేశ్‌ అన్నారు. శనివారం స్థానిక కాఫీహౌస్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన ఒక రోజు శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో సమయపాలన, క్రమశిక్షణ అత్యంత కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులకు వ్యక్తిత్వ వికాసం, విశ్వసనీయత, విధుల నిర్వహణ, కార్యాలయ పాలనపై శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, ఎంపీడీవోలు కేవీ.నరసింగరావు, వెంకన్నబాబు సంధానకర్తలుగా వ్యవహరించారు.ఈ శిక్షణలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, 212 సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్‌లు పాలొన్నారు.


Advertisement
Advertisement
Advertisement