యుద్ధం వేళ నోరుజారిన బైడెన్

ABN , First Publish Date - 2022-03-02T20:32:19+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. పొరపాటున ఉక్రెయిన్లను ఇరానియన్ ప్రజలుగా..

యుద్ధం వేళ నోరుజారిన బైడెన్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. పొరపాటున ఉక్రెయిన్లను ఇరానియన్ ప్రజలుగా సంబోధించారు. ఆయన పొరబడిన సమయంలో వేదికపై ఉన్న ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ సరిచేసే ప్రయత్నం చేసినట్టు ఆమె నోటి కదలికలను బట్టి కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తూ స్టేట్ ఆఫ్ యూనియన్‌లో చేసిన ప్రసంగంలో బైడెన్ నోట ఈ పొరపాటు దొర్లింది.


''కీవ్‌ను ట్యాంకులతో పుతిన్ చుట్టుముట్టవచ్చు. అయినా ఎప్పటికీ ఆయన ఇరానియన్ ప్రజల మనసులను గెలుచుకోలేరు'' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ ప్రజల మనసులను గెలుచుకోలేరనడానికి బదులు ఆయన ఇరానియన్ ప్రజలంటూ బైడెన్ సంబోధించారు. క్షణాల్లోనే ఆ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. 79 ఏళ్ల బైడెన్ గత ఏడాది కూడా ఉపాధ్యక్షురాలు హారిస్‌ను పొరపాటున ప్రెసిడెంట్ హారిస్ అంటూ సంబోధించారు.

Updated Date - 2022-03-02T20:32:19+05:30 IST