రాహుల్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-10-19T04:03:12+05:30 IST

కొద్దిరోజుల్లో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాల్గొనే జోడో యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు.

రాహుల్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌

వైరా, అక్టోబరు 18: కొద్దిరోజుల్లో రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాల్గొనే జోడో యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు. వైరా కాంగ్రెస్‌ కార్యాలయంలో శీలం వెంకటనర్సిరెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్ర దేశంలో అందరిని ఐక్యం చేయటమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో శీలం వెంకటనర్సిరెడ్డి, తాళ్లూరి చంద్రప్రకాష్‌, స్వర్ణ నరేంద్ర, మంగీలాల్‌నాయక్‌, పమ్మి అశోక్‌, ఏదునూరి సీతరాములు, చప్పిడి వెంకటేశ్వర్లు, నున్నా కృష్ణయ్య, మట్టూరి కృష్ణారావు, బత్తుల గీత, పణితి శ్రీను, యడ్లపల్లి వీరయ్యచౌదరి, పాలేటి నర్సింహారావు, మోదుగు మురళీ, దుగ్గిరాల బాలస్వామి, ముత్యాల ప్రసాద్‌, నవీన్‌ రాథోడ్‌, కిషోర్‌, అనిల్‌ లాల్‌, జూపూడి శ్రీను, హన్మంతరావు, అంజనీ పాల్గొన్నారు.


Updated Date - 2022-10-19T04:03:12+05:30 IST