హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకి మోడల్ ఆత్మహత్యా యత్నం

ABN , First Publish Date - 2022-01-31T13:21:17+05:30 IST

ఓ ప్రముఖ మోడల్ హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన...

హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకి మోడల్ ఆత్మహత్యా యత్నం

జోధ్‌పూర్‌(రాజస్థాన్): ఓ ప్రముఖ మోడల్ హోటల్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌‌లోని ఓ హోటల్‌లో జరిగింది.గుంగున్ ఉపాధ్యాయ్ అనే మహిళ ఫ్యాషన్ మోడల్. ఈమె జోధ్‌పూర్ నగర నివాసి. గుంగున్ ఉదయపూర్ నుంచి జోధ్‌పూర్‌కు తిరిగి వచ్చింది. రాత్రి ఆమె జోధ్‌పూర్‌లోని రతనాడ ప్రాంతంలోని హోటల్ లార్డ్స్ ఇన్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకింది.టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు గుంగున్ తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు సమాచారం.గుంగున్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి హోటల్‌ వద్దకు వచ్చాడు.తండ్రి, పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకేసింది.


తీవ్రంగా గాయపడిన గుంగున్‌ను ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. మోడల్ గుంగున్ కాళ్లు, ఛాతీ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. మోడల్ కు రక్తం కోల్పోవడంతో వైద్యులు ఆమెకు నిరంతరంగా రక్తం ఎక్కిస్తున్నారు. గుంగున్ ఆత్మహత్య యత్నం ఎందుకు చేసిందో తెలియలేదు. మోడల్ స్పృహలోకి వస్తే గాని ఆత్మహత్య యత్నానికి కారణాలు ఏమిటో తెలియదని పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-01-31T13:21:17+05:30 IST