ECILలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2021-08-28T16:32:51+05:30 IST

హైదరాబాద్‌లోని ఎలక్రాటనిక్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)- దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద

ECILలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు

ఈసీఐఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని ఎలక్రాటనిక్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)- దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన సాంకేతిక నిపుణుల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 


మొత్తం ఖాళీలు: 21


ఉద్యోగాలు: టెక్నికల్‌ ఆఫీసర్లు 6, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు 8, జూనియర్‌ ఆర్టిజన్లు 7


అర్హత: టెక్నికల్‌ ఆఫీసర్లకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ, సైంటిఫిక్‌ అసిస్టెంట్లకు సంబంధిత డిప్లొమా, జూనియర్‌ ఆర్టిజన్లకు సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. అన్ని పోస్టులకూ ఏడాది అనుభవం ఉండాలి. 


వయసు: ఇంటర్వ్యూ నాటికి టెక్నికల్‌ ఆఫీసర్లకు 30 ఏళ్లు, మిగిలినవారికి 25 ఏళ్లు మించకూడదు. 


ఒప్పంద వ్యవధి: రెండేళ్లు


వేతనం: టెక్నికల్‌ ఆఫీసర్లకు రూ.23,000; సైంటిఫిక్‌ అసిస్టెంట్లకు రూ.20,384; జూనియర్‌ ఆర్టిజన్లకు రూ.18,564


ఇంటర్వ్యూలు: ఆగస్టు 28, 31; సెప్టెంబరు 3, 4, 6


వేదికలు: ఉద్యోగాన్ని అనుసరించి ముంబయి, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీలోని ఈసీఐఎల్‌ జోనల్‌ కార్యాలయాలు.


వెబ్‌సైట్‌: ecil.co.in


ఇది కూడా చదవండి

ఏపీ, తెలంగాణాలోని అంగన్‌వాడీల్లో పోస్టులు

ఈ పోస్టులకు అప్లై చేశారా.. ప్రారంభవేతనమే రూ.41 వేలు

ఏపీలో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు.. రూ.లక్ష వరకు జీతం.. ఖాళీలు ఎన్నంటే..


Updated Date - 2021-08-28T16:32:51+05:30 IST