జేఎన్టీయూ నుంచి 17 మందికి టీసీఎ్‌సలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2021-10-28T05:57:07+05:30 IST

కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 17 మం ది విద్యార్థులు టాటా కన్సల్టెన్సీ సర్వీసు సంస్థ కు క్యాం పస్‌ డ్రైవ్‌ పరీక్షల ద్వారా ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ ఎంఎల్‌ఎస్‌ దేవకుమార్‌ తెలిపారు.

జేఎన్టీయూ నుంచి 17 మందికి టీసీఎ్‌సలో ఉద్యోగాలు
ఎంపికైన కొంత మంది విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ దేవకుమార్‌

కలికిరి, అక్టోబరు 27: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 17 మం ది విద్యార్థులు టాటా కన్సల్టెన్సీ సర్వీసు సంస్థ కు క్యాం పస్‌ డ్రైవ్‌ పరీక్షల ద్వారా ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ ఎంఎల్‌ఎస్‌ దేవకుమార్‌  తెలిపారు. మొత్తంగా మూడు దశలుగా జరిగిన వడపోత పరీక్షల్లో ఆఖరుకు 17 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందినట్లు చెప్పారు. బుధవారం ప్రిన్సిపాల్‌ దేవకుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సి.సుభాష్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ అపర్ణ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఎంపికైన వారు ఆర్‌.జ్యోతి కిరణ్‌, వి.దీపిక, కె.దీపిక(మెకానికల్‌), డి.నందిని, ఎస్‌.వందన, ఎస్‌.సైరాబాను, సి.జ్ఞానకీర్తన, ఎ.హరికృష్ణ (ఎలకా్ట్రనిక్స్‌), ఇ.బిందుశ్రీ, ఎస్‌.ముషీర్‌, ఐ.శ్రీదేవి, ఎస్‌.సౌమ్య, సి.ప్రసాద్‌రాయ్‌ (కంప్యూటర్‌ సైన్స్‌), బి.మౌశ్రిత, సి.చంద్రమౌళి (ఎలెక్ట్రికల్‌), డి.సాయిరామ్‌ ప్రశాంత్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) బి.మౌశ్రిత (ఎలెక్ట్రికల్‌) హెక్సవేర్‌ కంపెనీ పరీక్షలో కూడా అర్హత సాధించిందని చెప్పారు. 3దశల్లో జరిగిన ఒకే పరీక్షలో 17 మంది ఎంపిక కావడం అరుదైన విషయంగా ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-28T05:57:07+05:30 IST