21న ఆన్‌లైన్‌లో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2022-01-20T06:48:27+05:30 IST

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 21న ఆన్‌లైన్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి బుఽధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో 790 పోస్టుల భర్తీకి 21న ఉదయం 11.30గంటల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

21న ఆన్‌లైన్‌లో జాబ్‌మేళా

భువనగిరి టౌన్‌, జనవరి 19: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 21న ఆన్‌లైన్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి బుఽధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్‌ రంగంలో 790 పోస్టుల భర్తీకి 21న ఉదయం 11.30గంటల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపోలో హోం కేర్‌లో 540 పోస్టులు, డెలివరీ ఎగ్జిక్యుటీవ్స్‌కు 400 పోస్టులు, ఎస్‌బీఐ కార్డు ఓపెనింగ్‌లో 340 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హతలు, అనుభవం ఆధారంగా అపోలో హోం కేర్‌కు రూ.17,500 నుంచి రూ.21,000, డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌కు రూ.18,500, ఎస్‌ బీఐ కార్డు ఓపెనింగ్స్‌కు రూ.14,000లతో పాటు ఇతర అలవెన్స్‌లు ఇవ్వను న్నట్లు తెలిపారు. రిజిస్ర్టేషన్‌కోసం పేరు, అర్హతలు, మొబైల్‌ నెంబర్‌ తదితర వివరాలు ఛ్ఛ్ఛ.డ్చఛ్చీఛీటజీఃజఝ్చజీజూ.ఛిౌఝకు మెయిల్‌ చేయాలని, గూగుల్‌ మీట్‌ ఐడీ ఝ్ఛ్ఛ్ట. జౌౌజజ్ఛూ.ఛిౌఝ/జ్ఠిజౌజీజఞజ్డ్డి ద్వారా జాబ్‌మేళాలో పాల్గొనాలని తెలిపారు. 

Updated Date - 2022-01-20T06:48:27+05:30 IST