జిల్లాలోనే మేటిగా నున్న లే అవుట్‌

ABN , First Publish Date - 2022-05-15T06:41:54+05:30 IST

జిల్లాలోనే మేటిగా నున్న లే అవుట్‌

జిల్లాలోనే మేటిగా నున్న లే అవుట్‌
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు, పక్కన ఎంపీడీఓ సునీతబ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ దిల్లీరావు, పక్కన ఎంపీడీఓ సునీత

విజయవాడ రూరల్‌, మే 14 : వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో నున్న మోడల్‌ లే అవుట్‌ జిల్లాలోనే టాప్‌గా ఉందని ఎన్‌టీఆర్‌ విజయవాడ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ దిల్లీరావు అన్నారు. మోడల్‌ లే అవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన సుమారు 6,363 మంది లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు లే అవుట్‌ పరిసర ప్రాంతాల్లోని సౌకర్యాలు, ఇళ్ల మోడల్స్‌పై మండల పరిషత్‌, రెవెన్యూ, హౌసింగ్‌శాఖలు ముద్రించిన బ్రోచర్‌ను విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల మాదిరిగా వైఎస్సార్‌ జగనన్న కాలనీని తీర్చిదిద్దుతున్నట్లు, ఆ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలను పేర్కొనటంపై ప్రత్యేక చొరవ చూపిన ఎంపీడీఓ జుజ్జవరపు సునీతను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.   జిల్లాలోని ఇతర మండలాల ఎంపీడీఓలు కూడా విజయవాడ రూరల్‌ మండల అఽధికారులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రూరల్‌ తరహాలోనే లే అవుట్‌ ఇళ్ల డిజైన్‌, సౌకర్యాలు తెలియజేసేలా బ్రోచర్‌ను ముద్రించాలని, ఇందుకు అవసరమైతే ఎంపీడీఓ సునీత సహకారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జుజ్జవరపు సునీత, తహసీల్దార్‌ బీ సాయి శ్రీనివాస్‌ నాయక్‌, హౌసింగ్‌ డీఈఈ నాగమల్లేశ్వరరావు, ఏఈ ప్రసాద్‌, ఆర్‌ఐ రామ్‌సింగ్‌ పాల్గొన్నారు. 

ఇంటింటికీ మోడల్‌ లే అవుట్‌ బ్రోచర్‌

  నున్న  వైఎస్సార్‌ జగనన్న కాలనీ మోడల్‌ లే అవుట్‌పై అధికారులు రూపొందించిన బ్రోచర్‌ను సర్పంచ్‌ కాటూరి సరళ, పంచాయతీ కార్యదర్శి జీటీవీ రమణ శనివారం ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణలను వేగవంతం చేయాలని సర్పంచ్‌ సరళ కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-15T06:41:54+05:30 IST