కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి : జూలకంటి

ABN , First Publish Date - 2020-10-30T11:27:20+05:30 IST

ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యునిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జయసారథిరెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు.

కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి : జూలకంటి

నకిరేకల్‌, అక్టోబరు 29 : ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యునిస్టు పార్టీల ఉమ్మడి అభ్యర్థి జయసారథిరెడ్డిని పట్టభద్రులు గెలిపించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సీపీఐ, సీపీఎం నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం మాట్లాడుతూ పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసు కోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కమ్యూనిస్టుల అభ్యర్థి జయసారథిరెడ్డి, కందాల ప్రమీళ, లోడంగి శ్రవణ్‌కుమార్‌, బొజ్జ చిన్నవెంకులు, నగేష్‌, చంద్రమౌళి, మర్రి వెంకటయ్య, సైదులు, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. 


నల్లగొండ రూరల్‌ : తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజావాణి వినిపిస్తానని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి బి.జయసారథిరెడ్డి అన్నారు. స్థానిక ముగ్దుం భవన్‌లో గురువారం నిర్వహించిన ఎఐవైఎ్‌సఎ ఫ్‌, ఎఐవైఎ్‌ఫఐ, ఎస్‌ఎ్‌ఫఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ  ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బలవంతంగా వీఆర్‌ఎస్‌ ఇస్తోందన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులపై నిరంకుశంగా వ్యవరిస్తూ రాష్ట్రంలో ఉన్న 1.50లక్షల ఉద్యోగుల భర్తీలో పూర్తిగా విఫలమైంద ని ఆరోపించారు. ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ, ఎస్‌ ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. సమావేశంలో సీ పీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం,  విద్యార్థి యువజన సంఘాల కా ర్యదర్శులు బరిగెల వెంకటేష్‌ తీర్పారి వెంకటేశ్వర్లు, మల్ల మహేష్‌,  ఉప్ప ల ఉదయ్‌కుమార్‌, ముదిగొండ మురళీకృష్ణ, శ్రీకాంత్‌, వనమాల ఆంజనేయులు కందుల మధు, ప్రవీణ్‌ పాల్గొన్నారు.


వేములపల్లి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికై ప్రశ్నించే గొంతుకైన వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించాలని వైస్‌ ఎంపీపీ పాదూరి గోవర్దని కోరారు. గురువారం ఆమె మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య, సీపీఎం మండల నాయకులు అంకెపాక సైదులు, గరికెపాటి మధు, శ్రీనివాసచారి, పీ.సైదులు, వెంకన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:27:20+05:30 IST