జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

ABN , First Publish Date - 2020-07-04T02:59:42+05:30 IST

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా వేసినట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి పోఖ్రియాల్ శుక్రవారం

జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా వేసినట్టు కేంద్ర మానవ వనరుల మంత్రి పోఖ్రియాల్ శుక్రవారం ప్రకటించారు. కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం గురువారం సమర్పించిన ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షలను వాయిదా వేసిన కేంద్రం కొత్త తేదీలను ప్రకటించింది. సెప్టెంబరు 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనుండగా, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్షను నిర్వహించనున్నారు.  


నిజానికి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ జులై 18 నుంచి 23 వరకు నిర్వహించాల్సి ఉండగా, నీట్‌ 2020 జులై 26న జరగాల్సి ఉంది. ఈ రెండు పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి పోఖ్రియాల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీతో కూడిన నిపుణుల కమిటీని కోరారు. ఈ కమిటీ నిన్న నివేదిక ఇచ్చింది.    

Updated Date - 2020-07-04T02:59:42+05:30 IST