- ఏడాదికి ముందే ఎన్నికల కసరత్తు
- పంచరత్నాల ప్రచారానికి 123 వాహనాల కొనుగోలు
బెంగళూరు: జేడీఎస్ పార్టీ ఏడాదికి ముందే ఎన్నికల కసరత్తును తీవ్రతరం చేస్తోంది. ‘జనతా జలధార’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు సాగించిన పార్టీ నేతలు ‘పంచరత్న’ పథకాల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పంచరత్నాల పేరిట సంక్షేమాలు అమలు చేయదలిచామని పార్టీ కీలక నేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే 123 ఎల్ఈడీ వాహనాలను కొనుగోలు చేశారు. యశ్వంతపురలోని అరవింద్మోటార్స్లో 123 టాటా ఏస్ వాహనాలను ప్రచారం కోసం కొనుగోలు చేశారు. వాటికి ఎల్ఈడీ స్ర్కీన్లను అమర్చి 180 నియోజకవర్గాల పరిధిలో లఘు చిత్రాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు. 123 వాహనాల కొనుగోళ్లకు సంబంధించి ప్రక్రియ బుధవారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీరు, ఉద్యోగం, మహిళా, యువ స్వావలంబన వంటి పంచరత్నాలను ప్రచారం చేస్తామన్నారు. రానున్న 40 రోజుల్లో వీటికి ఎల్ఈడీ స్ర్కీన్లను సమకూర్చి ప్రచారం చేయనున్నట్లు కుమారస్వామి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి