Abn logo
Aug 3 2021 @ 12:09PM

కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన

అనంతపురం: తాడిపత్రి ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగుతోంది. నిన్నటి నుంచి మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే ఛైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు ఆందోళన చేస్తున్నారు. అధికారుల వైఖరిపై మండిపడుతున్నారు. సమీక్ష ఉందని రెండు రోజుల క్రితమే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినప్పటికీ అధికారులు రాలేదు. ఎమ్మెల్యే సమీక్షకు కమిషనర్ వెళ్లడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఆయన రాత్రి కూడా అక్కడే నిద్రించారు. మంగళవారం కూడా ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన చేస్తానని జేసీ స్పష్టం చేశారు.