సెంటు భూమి కూడా ఎండిపోనివ్వొద్దు : జేసీ

ABN , First Publish Date - 2021-02-27T06:34:35+05:30 IST

జిల్లాలో ఒక్క సెంటు భూమిలో కూడా పంట ఎండిపోకుండా సాగునీరందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. వెంకట రమణా రెడ్డి అధికారులను ఆదేశిం చారు.

సెంటు భూమి కూడా ఎండిపోనివ్వొద్దు : జేసీ


ఏలూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఒక్క సెంటు భూమిలో కూడా పంట ఎండిపోకుండా సాగునీరందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. వెంకట రమణా రెడ్డి అధికారులను ఆదేశిం చారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో శుక్రవా రం ఆయన సమీక్షించారు.  ఏ ప్రాంతంలోనూ సాగు నీటి ఎద్దడి  రానివ్వద్దని,  శివారు భూములకు  నీరందేలా వంతులవారీ విధానం అమలు చేయా లన్నారు. మార్చి 15 నాటికి జిల్లాలో  రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాల న్నారు.  జేడీ గౌసియా బేగం, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంద్ర భాస్కర్‌రెడ్డి, డీసీవో వెంకట రమణ, మార్క్‌ ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నాగ మల్లిక పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T06:34:35+05:30 IST