Abn logo
Apr 4 2020 @ 04:53AM

వ్యాధిగ్రస్థుల కోసం టెలీకన్సల్టెన్సీ

జేసీ డాక్టర్‌ వినోద్‌కుమార్‌


నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 3 : లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో సాధారణ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడకుండా వైద్యుల బృందంతో టెలీకన్సట్టెన్సీ ఏర్పాటు చేశామని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.  జేసీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఎమర్జెన్సీ సేవలు మినహా ప్రభుత్వ,  ప్రైవేట్‌ వైద్యసేవలు నిలిపివేశారన్నారు..


బీపీ, షుగర్‌, గుండె వ్యాధులకు, ఆయాసం తదితర వ్యాఽధిగ్రస్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్న పిల్లల వైద్యులు, జనరల్‌ ఫిజీషియన్‌, ఊపిరితిత్తులకు సంబంధించి వైద్యులు, గర్భకోశ, మానసిక వ్యాధుల బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 425 6040కు ఫోన్‌ చేసి  సమస్యలు వివరిస్తే వైద్యులు వివరాలు తెలుసుకుని వాట్సప్‌ నెంబర్‌కు వాడాల్సిన మందుల వివరాలు పంపుతారన్నారు. 14 ర్యాపిడ్‌ వైద్య బృందాలు అత్యవసర వైద్య సేవలకు రోగి ఇంటికే వచ్చి చికిత్స అందిస్తాయన్నారు.

Advertisement
Advertisement
Advertisement