‘జయ.. జయ’శంకర్‌ సార్‌.. ఘనంగా జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-08-07T14:08:36+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ మడమ తిప్పని పోరాటయోధుడని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. గురువారం

‘జయ.. జయ’శంకర్‌ సార్‌.. ఘనంగా జయంతి వేడుకలు

నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు


చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ మడమ తిప్పని పోరాటయోధుడని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. గురువారం గాంధీనగర్‌ డివిజన్‌లోని జవహర్‌నగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న జయశంకర్‌ విగ్రహానికి కార్పొరేటర్‌ ముఠా పద్మానరే్‌షతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో...

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న జయశంకర్‌ విగ్రహానికి వర్సిటీ వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, రిజిష్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ ఉన్నతాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్‌ సైంటిస్ట్‌ ఫోరం ఆధ్వర్యాన రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల ఆవరణలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ సర్కిల్‌ సీనియర్‌ నాయకులు వెంకటేశ్‌, సత్తయ్య, వెంకటస్వామి, టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు జంగయ్య, యాదగిరి జయశంకర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.


హౌస్‌ ఫెడ్‌ కార్యాలయంలో...

రాంనగర్‌: బాగ్‌లింగంపల్లిలోని హౌస్‌ ఫెడ్‌ కార్యాలయంలో జయశంకర్‌  చిత్రపటానికి హౌస్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ ఎ.కిషన్‌రావు నివాళులర్పించారు. 


చిక్కడపల్లి: జయశంకర్‌ జయంతి సభను చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో గ్రాంథాలయ కార్యదర్శి పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. 


కవాడిగూడ: జయశంకర్‌ చిత్రపటానికి తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్‌ పులిగారి గోవర్ధన్‌రెడ్డి నివాళులర్పించారు. 


అల్వాల్‌ పరిధిలో...

అల్వాల్‌ ఈ సేవ చౌరస్తా వద్ద నిర్వహించిన జయశంకర్‌ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద జయశంకర్‌ చిత్రపటానికి డీసీ యాదయ్య, కార్పొరేటర్‌ శాంతిశ్రీనివా్‌సరెడ్డి, సబితాకిషోర్‌, ఆయా విభాగాల ఉద్యోగులు పాల్గొని నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్‌ నాయకుడు దిలీ్‌పకుమార్‌, సురేందర్‌రెడ్డి అతిథులుగా పాల్గొని జయశంకర్‌  విగ్రహానికి నివాళులర్పించారు.


టీఎన్జీవోస్‌ నాయకుల ఆధ్వర్యంలో.. 

నాంపల్లిలోని యూనియన్‌ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి టీఎన్జీవోస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎం హుస్సేని నివాళులర్పించారు.


దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలో...

(దిల్‌సుఖ్‌నగర్‌ జోన్‌ బృందం): ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను గురువారం ఎల్‌బీనగర్‌, మహేశ్వరం, మలక్‌పేట, యాకుత్‌పుర నియోజకవర్గాల పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నివాళులర్పించారు. లింగోజిగూడలో తెలంగాణ ఉద్యమకారుడు నర్రె శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి కార్పొరేటర్‌ శ్రీనివా్‌సరావు నివాళులర్పించారు. ఫతుల్లాగూడ సర్వే నం.58 బస్తీలోని జయశంకర్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి, సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు నల్లా రఘుమారెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక దిల్‌సుఖ్‌నగర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి వేదిక జిల్లా కార్యదర్శి పగడాల రమణ, డివిజన్‌ అధ్యక్షుడు గౌని చంద్రయ్య తదితరులు నివాళులర్పించారు.


బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్‌ చిత్రపటానికి మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి నివాళులర్పించారు. కార్పొరేటర్‌ సంతోషీశ్రీనివా్‌సరెడ్డి, డీఈఈ అశోక్‌రెడ్డి, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-07T14:08:36+05:30 IST