అభిమానుల మధ్య జయమంగళ జన్మదిన వేడుక
ABN , First Publish Date - 2021-04-16T06:54:19+05:30 IST
కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు.
కైకలూరు : కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకట రమణ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు. ఆటపాకలోని ఆయన ఇంటివద్ద కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి భారతదేశం తొందరగా బయట పడాలని ఆకాంక్షించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. టీడీపీ నాయకులు పోలవరపు లక్ష్మీరాణి, పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి, పూల రామచంద్రరావు, పి.రాధాకృష్ణ తదితర పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు