కృష్ణా.. ముకుందా.. మురారి

ABN , First Publish Date - 2022-08-20T06:05:27+05:30 IST

కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

కృష్ణా.. ముకుందా.. మురారి

ఘనంగా కృష్ణాష్టమి 

ఉత్సాహంగా ఉట్టి కొట్టే వేడుకలు  

పాఠశాలల్లో కృష్ణుడు, గోపికల వేషధారణల సందడి


కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆలయా ల్లో స్వామివారికి విశేష పూజలు చేశారు. భక్తులకు పలుచోట్ల అన్నదానం జరిగింది. ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. పాఠశాలల్లో  విద్యార్థుల కృష్ణుడు, గోపికల వేషధారణలు అలరించాయి. 


కైకలూరు, ఆగస్టు 19: కృష్ణాష్టమి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కైకలూరు  మీసాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణ యాదవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో   వేడుకలు జరిపారు.  పలువురు దంపతులు  పూజలు చేశారు.  ఎంపీపీ అడవి వెంకట కృష్ణ మోహన్‌, ఉత్సవ కమిటీ సభ్యులు బోయిన రామకృష్ణ, బూరుబోయిన మోహనరావు, టీడీపీ నాయకులు బి.కె.ఎం.నాని, పూల రామచంద్రరావు, జనసేన నాయకుడు బి.వి.రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించి సాయంత్రం  శ్యామలాంబ ఆలయ కళా మండపం వద్ద ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు.  కైకలూరు గీతా మందిరంలో నగర సంకీర్తన, వేగిరెడ్డి సురేష్‌ సౌజన్యంతో భక్తులకు అన్నసమారాధన చేశారు. కైకలూరు బంగారు కొట్లు వీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు   కైకలూ రు సర్పంచ్‌ డి.ఎం.నవరత్నకుమారి, కమ్మిలి స్వర్ణకుమారి బహుమతులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, దాసరి శివన్నారాయణ పాల్గొన్నారు. భుజబలపట్నంలో శ్రీకృష్ణ ఆలయం నుంచి మేళతాళాల మధ్య స్వామి వారి ఊరేగింపును   వైభవంగా నిర్వహించారు.

 మండవల్లి: మండవల్లి శ్రీకృష్ణుని ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.  మండలంలోని పలు గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకల అనంతరం సాయంత్రం  ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు చేబోయిన వీర్రాజు, బొమ్మన బోయిన గోకర్ణ యాదవ్‌, సర్పంచ్‌  నాగమణి తదితరులు పాల్గొన్నారు.

ముదినేపల్లి: ముదినేపల్లిలోని సువర్చలా సమేత  భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో, పెదగొన్నూరు, విశ్వనాద్రిపాలెం, అల్లూరు, గొల్లగూడెం, రామచంద్రపురం, శ్రీహరిపురం గ్రామాల్లోను ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వనాద్రిపాలెంలో కృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. పలు చోట్ల చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. 

ముదినేపల్లి రూరల్‌:  మండలంలోని పేరూరు, గురజ, పెదపాలపర్రు, వైవాక గ్రామాల్లో జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. పేరూరులో పుట్టి లక్ష్మణస్వామి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సింగరాయిపాలెం వేడుకల్లో మాజీ సర్పంచ్‌ బుసనబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.  వడాలిలో జగన్నాథస్వామి  రథోత్సవానికి   భక్తులు భారీగా తరలివచ్చారు. ఇన్‌చార్జ్‌ ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

కలిదిండి: కలిదిండిలో శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని గుర్రాల వాహనంపై ఘనంగా ఊరేగించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి  విజేత లకు బహుమతులు అందించారు.  సర్పంచ్‌ మారుతి ప్రసన్న,  ఎంపీటీసీ నీలి సుమన్‌, జడ్పీటీసీ మాజీ సభ్యులు నున్న రమాదేవి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  కోరుకొల్లులో ఘనంగా పూజలు, ఊరేగింపు నిర్వహించారు.  సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ, నున్న సుబ్రహ్మణ్యం, నల్లిబోయిన భోగేశ్వర రావు, నున్న నరసింహారావు, తలారి హరీష్‌, వీరుళ్లు, గంగుల వెంకన్న బాబు పాల్గొన్నారు. పెదలంక శ్రీకృష్ణుడి ఆలయంలో పూజల అనంతరం ఉట్టి కొట్టినవారికి  బహుమతులు ప్రదానం చేశారు. ఆలయ కమిటీ పాల్గొంది.


నూజివీడు నియోజకవర్గంలో...

నూజివీడు టౌన్‌, ఆగస్టు 19: కృష్ణాష్టమి వేడుకలను నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద యోగీశ్వరుల భక్తబృందం ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత పారాయణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావిచర్ల సర్పంచ్‌, ఏఎంసీ మాజీ  చైర్మన్‌ కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూజివీడు త్రివిధ, కుమార్‌ పాఠశాలల విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో అలరించారు.  ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ ఎస్‌.శ్రీనివాస్‌,  పీవీ కుమార్‌,  సిబ్బంది పాల్గొన్నారు.

ముసునూరు:  ముసునూరు పడమట రామాలయంలో యాదవ యూత్‌ ఆధ్వర్యంలో  స్వామివారికి 108 బిందెల జలాభిషేకం, పంచామృతాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించగా, ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యేశ్వరాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు.  అనంతరం ఉట్టి కొట్టేందుకు యువకులు పోటీపడ్డారు. అలాగే గోపవరం, చెక్కపల్లి, కాట్రేనిపాడు, లోపూడి, గోగులంపాడు గ్రామాల్లో యాదవ యూత్‌ ఆధ్వర్యంలో వైభవంగా ఊరేగింపులు జరిపారు. గ్రామ పెద్దలు మానికల అచ్చియ్య దంపతులు, పేరం సోమయ్య, మానికల గంగధరరావు, సాకిరి శ్రీనివాసరావు, పాకనాటి వడ్డికాసులు, పి. సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

చాట్రాయి: మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పల్లెల్లో కృష్ణుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికలు వేషధారణలో అలరించారు. స్థానిక వికాస్‌ స్కూల్‌లో వేడుకలు జరిగాయి. గ్రామ కూడళ్ళలో ఉట్టికొట్టే కార్యక్రమాల్లో  యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఆగిరిపల్లి: ఆగిరిపల్లి,  నెక్కలం గొల్లగూడెం వేణుగోపాల స్వామి ఆలయాలతో పాటు వట్టిగుడిపాడు రామాలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.  స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు  అన్నసమారాధన చేశారు. నెక్కలంగొల్లగూడెంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, టీడీపీ నాయులు పర్వతనేని గంగాధర్‌ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ వీరబాబు, మాజీ జడ్పీటీసీ కాజ రాంబాబు, ఎంపీటీసీ గుర్రం శ్రీనివాసరావు, కూరాకుల కొండలు, పి.గోపాలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T06:05:27+05:30 IST