Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముందు పెద్దలు క్రమశిక్షణగా ఉండి మాకు చెప్పండి: జనగామ డీసీసీ అధ్యక్షుడు

హైదరాబాద్: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగారాఘవ రెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ తరగతుల సందర్భంగా జరిగిన గొడవకు తనకు సంబంధం లేదని తెలిపారు. గాంధీ భవన్‌లో ఉన్న పెద్దలు ముందుగా క్రమశిక్షణగా ఉండి తమకు క్రమశిక్షణ గురించి చెప్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని గతంలో చాలామంది తిట్టారని.. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. క్రమశిక్షణ తరగతుల సంధర్భంగా గొడవకు కారణం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని తెలిపారు. శిక్షణ తరగతులకు రమ్మన్నది వాళ్ళే.. రాత్రికి రాత్రి పాసులు క్యాన్సిల్ చేసింది వాళ్ళే అని అన్నారు. జిల్లా అధ్యక్షుడికి తెలియకుండా.. పాసులు ఎలా క్యాన్సిల్ చేస్తారని క్రమశిక్షణ సంఘంకు ఇచ్చిన వివరణలో జంగా రాఘవ రెడ్డి నిలదీశారు. 

Advertisement
Advertisement