ఇసుక లారీలను అడ్డుకున్న జనసేన

ABN , First Publish Date - 2022-05-27T05:32:11+05:30 IST

ఇసుక రవాణా లారీలతో రహదారి అధ్వానంగా మారిందని, దేవస్థానం టోల్‌ గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన మండల అధ్యక్షుడు కంబాల బాబు అన్నారు.

ఇసుక లారీలను అడ్డుకున్న జనసేన
ఇసుక లారీలను అడ్డుకుని నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు

రహదారి అధ్వానంగా మారిందని ఆందోళన

పెనుగొండ, మే 26: ఇసుక రవాణా లారీలతో రహదారి అధ్వానంగా మారిందని, దేవస్థానం టోల్‌ గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన మండల అధ్యక్షుడు కంబాల బాబు అన్నారు. సిద్దాంతం కేదార్‌ ఘాట్‌లో ఇసుక ర్యాంప్‌ టోల్‌గేట్‌ వద్ద గురువారం జనసేన కార్యకర్తలు ఇసుక లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. లారీల నుంచి టోల్‌ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ బురదమయం, గుంతలతో ఉన్న రోడ్లను పూడ్చకుండా వదిలేశారన్నారు. ఈ దారి గుండా శ్మశాన వాటికకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా అధికారులు అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై అధి కారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఐ బండి మోహనరావు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-05-27T05:32:11+05:30 IST