వన్‌టౌన్, నవంబరు 28 : ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే జగన్‌రెడ్డి ధరల నియంత్రణపై దృష్టి సారించాలని, పోలవరం నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని, అమ రావతినే రాజధానిగా ప్రకటించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధి కార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కొత్తపేటలోని జనసేన పార్టీ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. జగన్‌రెడ్డి పాలనలో నిత్యా వసరాల ధరలు రెండింతలయ్యాయని, విద్యుత్ చార్జీలు పెంచేశారన్నారు. హస్తిన పర్యటనలో పవన్ కళ్యాణ్ పోల వరం, అమరావతి గురించి మాట్లాడారన్నారు. మంత్రి కుర సాల కన్నబాబు సొంతజిల్లా రైతులను పలకరించే తీరిక లేదుగానీ, విజయవాడలో మీడియా సమావేశాలు మాత్రం నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ని హైదరాబాద్ ఆంధ్రులు గ్రేటర్ ఎన్నికల్లో ఓడించాలన్నారు. నటుడు ప్రకాష్‌రాజ్, పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు.