Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనసేన కార్యకర్తలు ఆధైర్యపడవద్దు

గాదె వెంకటేశ్వరరావు 


బాపట్ల: జనసేన పార్టీ కార్యకర్తలు ఆధైర్య పడరాదని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కోరారు. పట్టణంలోని అన్నంసతీష్‌ ప్రభాకర్‌ కాపుకల్యాణ మండపంలో సోమవారం జనసేనపార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గాదె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జనసైనికులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్‌ జస్వంత్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం దివ్యాంగుల నాయ కులు గోగన ఆదిశేషు తదితరులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గుంటుపల్లి తులసీకుమారి, నామన శిమన్నారాయణ, ఆరమండ్ల సుజిత, కొట్రా మణికంట, జిడుగు మాదురి, ఆకుల శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement