Jallikattu ఎద్దు విగ్రహానికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-01-21T15:52:49+05:30 IST

పదేళ్ల క్రితం మృతిచెందిన జల్లికట్టు ఎద్దు స్మారకార్ధం బుధవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించారు. శివగంగ సమీపం శివల్‌పట్టి గ్రామంలోని మందకరుప్పన్‌ ఆలయంలో జల్లికట్టు ఎద్దును

Jallikattu ఎద్దు విగ్రహానికి ప్రత్యేక పూజలు

పెరంబూర్‌(చెన్నై): పదేళ్ల క్రితం మృతిచెందిన జల్లికట్టు ఎద్దు స్మారకార్ధం బుధవారం గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించారు. శివగంగ సమీపం శివల్‌పట్టి గ్రామంలోని మందకరుప్పన్‌ ఆలయంలో జల్లికట్టు ఎద్దును గ్రామస్తులు సంరక్షిస్తున్నారు. ఈ ఎద్దు పలు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించింది. పదేళ్ల కిత్రం అనారోగ్యానికి గురైన ఎద్దు మృతిచెందడంతో గ్రామస్తులు ఆవేదనకు గురయ్యారు. ఎద్దు కళేబరాన్ని ఆలయ సమీపంలోనే ఖననం చేసిన గ్రామస్తులు, ఆ ప్రాంతంలో మణిమండపం ఏర్పాటు చేసి, ఎద్దు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో, ఎద్దు మృతిచెంది పదేళ్లు కావడంతో, గ్రామస్తులు ఎద్దు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, పొంగళ్లు పెట్టి నైవేధ్యం సమర్పించారు.

Updated Date - 2022-01-21T15:52:49+05:30 IST