ఖైదీతో జైలర్ శృంగారం
ABN , First Publish Date - 2021-07-06T08:12:23+05:30 IST
జైల్లో ఖైదీల ప్రవర్తను సరిచేయాల్సిన కరెక్షనల్ ఆఫీసర్ ఆమె. తానే గతి తప్పి ఖైదీతో జైల్లోనే శృంగారానికి దిగింది.
శాక్రమెంటో, జూలై 5: జైల్లో ఖైదీల ప్రవర్తను సరిచేయాల్సిన కరెక్షనల్ ఆఫీసర్ ఆమె. తానే గతి తప్పి ఖైదీతో జైల్లోనే శృంగారానికి దిగింది. తామిద్దరం శృంగారంలో పాల్గొంటుండగా చూడాలని అతగాడి సెల్‌లో ఉన్న మిగతా 11 మందినీ ఆదేశించింది! చివరికి పై అధికారులకు దొరికిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసింది. విధి నిర్వహణలో వికృత చర్యలకు పాల్పడిన ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించింది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన. ఆ రాష్ట్రంలోని ఫ్రెస్నో కౌంటీ జైలులో కరెక్షనల్ అధికారిగా పనిచేస్తున్న టీనా గొంజాలెజ్‌కు(27) లైంగిక కోర్కెలు చాలా ఎక్కువ. జైల్లో ఖైదీతో సంబంధం పెట్టుకున్న ఆమె త్వరత్వరగా శృంగారం చేయడానికి వీలుగా తన యూనిఫామ్‌కు రంధ్రాలు చేసుకుని జైలుకు వెళ్లేది. జైల్లో ఉన్న తన ప్రేమికుడికి సెల్‌ఫోన్ కొనిచ్చిన ఆమె దాంట్లో లైంగిక ఉద్రేకం కలిగించేలా చాటింగ్ చేసేది. జైల్లోని ఇతర అధికారులకు ఈ విషయం తెలిసిపోవడంతో అతడి సెల్‌లో సోదాలు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె బండారమంతా బయటపడింది. కోర్టు ఆమెకు ఏడు నెలల జైలు శిక్ష విధించింది.