విద్యుద్దీపాల వెలుగులో హౌసింగ్‌బోర్డు భక్తాంజనేయస్వామి దేవాలయం,
నేడు హనుమజ్జయంతి
వేడుకలకు ముస్తాబైన ఆలయాలు
అనంతపురం కల్చరల్, మే 24: హనుమజ్జయంతి వేడుకలకు నగరంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. హౌసింగ్ బోర్డులో వెలసిన భక్తాంజనేయస్వామి దేవాలయం, నగరశివారు సోములదొడ్డిలోని అభయాంజనేయస్వామి, మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, మారుతీనగర్‌లోని పంచముఖ ఆంజనేయస్వామి, పాతూరు వ్యాసరాజమఠం ఆవరణలోని మూలాంజనేయస్వామి, కోర్టు రోడ్డులోని వరదాంజనేయస్వామి, పాతూరు మార్కెట్ వద్ద గల మండి ఆంజనేయస్వామి తదితర ఆలయాలన్నీ వేడుకలకు సిద్ధమయ్యాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేశారు.
స్వామివారికి వెండిపాదుకలు సమర్పిస్తున్న భక్తులు