Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి విఫలం

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ద నాగజగదీశ్‌


అనకాపల్లి, డిసెంబరు 1: రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి విఫలమయ్యారని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్ద నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎప్పుడో కట్టిన గృహాలకు ఇప్పుడు డబ్బు కట్టించుకోవడం దుర్మార్గమన్నారు. డబ్బు చెల్లించని గృహ యజమానులకు పింఛన్లను రద్దు చేస్తామని చెప్పడం మరింత అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రగల్భాలు పలికిన జగన్‌రెడ్డి, ఇప్పుడు అప్పులు చేసి ప్రజలకు పప్పుకూడు పెడుతున్నారన్నారు. చివరకు రాష్ర్టాన్ని దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని బుద్ద పేర్కొన్నారు.

Advertisement
Advertisement