Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్కదారి పట్టిన ‘జగనన్న గోరుముద్ద’

  • సామగ్రి తరలిస్తుండగా హెచ్‌ఎంని పట్టుకున్న గ్రామస్థులు

ప్రత్తిపాడు, అక్టోబరు 23: ప్రత్తిపాడు మండలం శరభవరం మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన జగనన్న గోరుముద్ద సరుకులు పక్కదారి పట్టాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీర్రాజు శనివారం వాటిని దారి మళ్లిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. జగనన్న గోరుముద్ద పేరుతో పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం కోడిగుడ్లను, వేరుశనగ అచ్చులను పాఠశాలకు సరఫరా చేస్తుంది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే వీటిని తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. నల్లటి ప్లాస్టిక్‌ కవర్‌లో ఏడు కోడిగుడ్ల అట్టలను, ఆరు వేరుశనగ అచ్చుల ప్యాకెట్లను నింపుకుని మోటర్‌సైకిల్‌పై ఈ ప్యాక్‌ను పట్టుకుని తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. దీనిపై ప్రత్తిపాడు ఎంఈవో వి.రాజబాబును వివరణ కోరంగా ప్రధానోపాధ్యాయుడు వీటి ని కొనుగోలు చేసి తరలిస్తున్నట్టు తమకు చెప్పారని, దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Advertisement
Advertisement