బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా పఽథకాల జాడేదీ?

ABN , First Publish Date - 2022-05-15T06:53:15+05:30 IST

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బడాభీమ్‌గల్‌, సికింద్రాపూర్‌, గోన్‌గొప్పుల, బెజ్జోరా, ముచ్కూర్‌ గ్రామాల్లో సుమారు పదికోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగుపై బ్రిడ్జిలు, బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ తరహా పఽథకాల జాడేదీ?

  కేంద్ర సర్వేలోనూ సంక్షేమాభివృద్ధిలో రాష్ట్రం నెంబర్‌ వన్‌ 

  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

భీమ్‌గల్‌ రూరల్‌, మే 14: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బడాభీమ్‌గల్‌, సికింద్రాపూర్‌, గోన్‌గొప్పుల, బెజ్జోరా, ముచ్కూర్‌ గ్రామాల్లో సుమారు పదికోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగుపై బ్రిడ్జిలు, బీటీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేయించాలని సవాల్‌ విసిరారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా, పరిశుభ్రత, పచ్చదనం, విద్యుత్‌ సరఫరా వంటి మొదలగు అంశాల ప్రాతిపదికన సర్వేచేపట్టి దేశవ్యాప్తంగా పది ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసిందన్నారు. అందులో పదికి పది గ్రామాలు తెలంగాణాలోనే ఎంపిక య్యాయని గుర్తుచేశారు. దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. బడాభీమ్‌గల్‌, గోన్‌గొప్పుల మధ్య బోగారపు వాగుపై 2.6 కోట్ల అంచనా వ్యయంతో హైలెవల్‌ బ్రిడ్జ్‌, 1.13 కోట్ల అంచనా వ్యయంతో మరో బ్రిడ్జ్‌, సికింద్రాపూర్‌, గోన్‌ గొప్పుల, ముచ్కూర్‌ వరకు 3 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు, బడా భీమ్‌గల్‌ గ్రామలో కోటి రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో బడాభీమ్‌గల్‌ సర్పంచ్‌ ఎర్రోళ్ల సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 చెక్కుల అందజేత..

మోర్తాడ్‌: మండలంలోని సుంకెట్‌ గ్రామానికి చెందిన తీగెల మహేందర్‌కు సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ.4లక్షల చెక్కును శనివారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేశారు. మహేందర్‌ కరోనా బ్లాక్‌ పంగస్‌ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఆర్ధిక సహయం కోసం మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంత్రి చెక్కును మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్‌ శ్రీనివాస్‌; ఉపసర్పంచ్‌ నర్సారెడ్డి, సొసైటీ వైస్‌చైర్మన్‌ మల్లేష్‌ పాల్గొన్నారు.

బాల్కొండ: మండలంలోని వన్నెల(బి) గ్రామానికి చెందిన కౌలు రైతు సాయన్న మరణించడంతో ఆయన కుటుంబానికి శనివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూ.6లక్షల చెక్కులను అందజేశారు. 2016లో వ్యవసాయ క్షేత్రంలో మరణించిన మృతుని కుటుంబ సభ్యులకు వేల్పూర్‌లోని ఆయన నివాసంలో చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ నాగులపల్లి రాజేశ్వర్‌, ఉపసర్పంచ్‌ నాగులపల్లి కిషన్‌, సొసైటీ డైరెక్టర్‌ సురజ్‌ పాల్గొన్నారు. 

మంత్రి ప్రశాంత్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కులేదు..

భీమ్‌గల్‌, మే14: వడ్ల కొనుగోలు విషయంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తూ 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను ముమ్మరం చేయించారని ఈ విషయంలో మాజీవిప్‌ ఈరవత్రి అనిల్‌  అవగాహన లేకుండా విమర్శించడం మానుకోవాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య అన్నారు. 

Updated Date - 2022-05-15T06:53:15+05:30 IST