మైనస్‌ ఉష్ణోగ్రతల్లోనూ చలించని జీవి!

ABN , First Publish Date - 2022-06-03T09:10:32+05:30 IST

పెద్ద శరీరం, దృఢమైన చిన్న కాళ్లు, చిన్న చెవులు, మంచు కొండల్లో నివాసం... జడలబర్రె విశేషాలు ఇవి. హిమాలయ పర్వత ప్రాంతాలతో పాటు,

మైనస్‌ ఉష్ణోగ్రతల్లోనూ చలించని జీవి!

తెలుసుకుందాం!


పెద్ద శరీరం, దృఢమైన చిన్న కాళ్లు, చిన్న చెవులు, మంచు కొండల్లో నివాసం... జడలబర్రె విశేషాలు ఇవి. హిమాలయ పర్వత ప్రాంతాలతో పాటు, నేపాల్‌, టిబెట్‌, మంగోలియా, చైనా ప్రాంతాల్లో జడలబర్రె కనిపిస్తుంది. పాలు, మాంసం కోసమే కాకుండా వస్తువుల రవాణా కోసం జడలబర్రెను అక్కడి ప్రజలు ఉపయోగిస్తుంటారు. 

వీటి జీవితలకాలం 20 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. మైనస్‌ 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇవి చలించకుండా నిలబడతాయి.

 వీటి ఎముకలతో దువ్వెనలు, ఆభరణాల వంటి హ్యాండీక్రాఫ్ట్స్‌ తయారుచేస్తారు. జడలబర్రె పాలతో ఒక ప్రత్యేక రకమైన చీజ్‌ను తయారుచేస్తారు. దాన్ని చుర్పీ అంటారు. 

ఇది కొమ్ములతో ఐస్‌గడ్డలను తొలగించి తనకు కావాల్సిన మొక్కలను తింటుంది. ఇతర జంతువుల నుంచి రక్షణకు కొమ్ములు ఉపయోగపడతాయి.

జడలబర్రె అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద కూడా నివసిస్తుంది. దీని చర్మం రెండు లేయర్లుగా ఉంటుంది. పై లేయర్‌లో చిక్కగా, మెత్తగా ఉండే జుట్టు చలి నుంచి కాపాడుతుంది.



Updated Date - 2022-06-03T09:10:32+05:30 IST