Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్డినెన్స్‌ ప్యాక్టరీలో జేఏసీ ఉద్యోగ సంఘాల ధర్నా

కంది, అక్టోబరు 14: ఆర్డినెన్స్‌ ప్యాక్టరీలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఎద్దుమైలారం వద్దనున్న ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆర్డినెన్స్‌ ప్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం జేఏసీ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీలోని డీఆర్డీవో భవన్‌లో కేంద్ర ప్రభుత్వం 7 నాన్‌ వెసిబుల్‌ కార్పొరేషన్‌లను ప్రారంభించనున్న సందర్భంగా  ఓడీఎఫ్‌ జేఏసీ ఉద్యోగ సంఘాల సభ్యులు మాట్లాడుతూ 210 ఏళ్ల జాతీయ ఆస్తి రక్షణ మనుగడ కోల్పోతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలను దేశంలోని 41 ఆర్డినెన్స్‌ ప్యాక్టరీల్లో పనిచేస్తున్న 76,000 మంది ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలసి బహిష్కరిస్తున్నామని ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఒక లేఖ ద్వారా తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ఉద్యోగ సంఘాల సభ్యులు ప్రభు, శ్రీనివాస్‌, భాస్కర్‌రావు, రాజయ్య, దశరథ్‌, శ్యామూల్‌, దయాకర్‌రెడ్డి, జానకిరాములు, రమణారెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement