Abn logo
Apr 9 2020 @ 05:54AM

హస్నాపూర్‌ను సందర్శించిన ఐటీడీఏ పీవో

ఉట్నూర్‌, ఏప్రిల్‌ 8: మండలంలోని హస్నాపూర్‌ గ్రామాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్‌మిశ్రా బుధవారం సందర్శించారు. ఇటీవల హస్నాపూర్‌కు చెందిన యువకుడికి కరోనా వైరస్‌ రావడంతో ఆ గ్రామంలో ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ఐటీడీఏ పీవో గ్రామాన్ని సందర్శించి డీడీఎంహెచ్‌వో డాక్టర్‌ కుడిమెత మనోహర్‌తో చర్చించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రజలు బయటకు రాకుండా పటిష్టంగా  లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్‌ విజయ్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ చరణ్‌దాస్‌, శ్రీనివాస్‌, రాజమ్మ, బుక్కావెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement
Advertisement