Abn logo
Mar 4 2021 @ 01:56AM

తాప్సి, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు!

ముంబై/న్యూఢిల్లీ, మార్చి 3: పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ బుధవారం సోదాలు నిర్వహించింది. నటి తాప్సీ పన్ను, దర్శక నిర్మాతలు అనురాగ్‌ కశ్యప్‌, వికాస్‌ బెహెల్‌, విక్రమాదిత్య మౌత్వానె, మధు మంతెనలతో పాటు రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో శుభాశిశ్‌ సర్కార్‌కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించారు. ముంబై, పుణెలోని 30ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. సోదాల తర్వాత తాప్సీ, కశ్య్‌పలను ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. తాప్సి, కశ్యప్‌.. ఢిల్లీలోని రైతు ఉద్యమానికి మద్దతుగా పలు సందర్భాల్లో స్పందించారు. ఈ విషయంపై తాప్సి, కంగనా మధ్య ఇటీవల వాగ్యుద్ధం కూడా జరిగింది. తాప్సీ, కశ్య్‌పలపై ఐటీ దాడులను కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఖండించాయి.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement