Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీర్ణశక్తి మెరుగుపడడానికి, కఫాన్ని తగ్గించడానికి..

ఆంధ్రజ్యోతి(04-05-2020): 

భారతీయుల ఆహారంలో వాము వాడుతున్నదే. ఇది కూడా ఔషధ లక్షణాలున్న వంట దినుసు. అజీర్తిని, కఫాన్ని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. వాము నుంచి తీసిన సారాన్ని ‘థైమాల్‌’ అంటారు. దీనినే ‘వాంపువ్వు’ అని పిలుస్తారు. బయట కొన్ని అంగళ్లలో దొరుకుతుంది. పావు గ్లాసు నీళ్లలోకి కొద్దిగా వాంపువ్వు వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కఫం ఆరుతుంది. కళ్లె తగ్గుతుంది. దగ్గు, జలుబు, తుమ్ములు ఆగుతాయి. కడుపులో గ్యాసుతో కూడిన నులినొప్పి, అజీర్తి వల్ల వచ్చే విరేచనాలు, నీళ్ల విరేచనాలు పోతాయి. ఈ వేసవిలో వచ్చిన వైరస్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తుంది వాము. 

ఏం చేయాలి? : ధనియాల పొడి, వాము పొడి సమానంగా కలిపి అన్నంలో కారప్పొడిలాగా తినవచ్చు. మజ్జిగలో కూడా కలుపుకుని తాగవచ్చు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...