అధికార మదంతో ఇష్టానుసారం వాగడం తగదు

ABN , First Publish Date - 2022-08-12T05:57:06+05:30 IST

అధికార మదంతో నోటికి వచ్చినట్టు మాట్లాడ టం సరికాదని, ఇష్టం వచ్చినట్టు మా పార్టీ అధినేత చంద్ర బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశపై మాట్లాడితే సహించేదిలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమ తం కాటమయ్య, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజ నేయులు, మార్కెట్‌యార్డ్‌ మాజీ డైరెక్టర్‌ అంబటి సనత ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తీవ్రస్థాయి లో మండిపడ్డారు.

అధికార మదంతో ఇష్టానుసారం వాగడం తగదు
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

చంద్రబాబు, లోకేశను 

నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం

ఎంపీ గోరంట్లపై టీడీపీ నాయకుల ఫైర్‌

ధర్మవరం, ఆగస్టు 11: అధికార మదంతో నోటికి వచ్చినట్టు మాట్లాడ టం సరికాదని,  ఇష్టం వచ్చినట్టు మా పార్టీ అధినేత చంద్ర బాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశపై మాట్లాడితే సహించేదిలేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కమ తం కాటమయ్య, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజ నేయులు,  మార్కెట్‌యార్డ్‌ మాజీ డైరెక్టర్‌ అంబటి సనత ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తీవ్రస్థాయి లో మండిపడ్డారు. వారు గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటన వైరల్‌ అయిన విషయంలో విలేకరుల సమావేశంలో ఇస్టాను సారం మాట్లాడారన్నారు. అనుమానం ఉన్నవారిని టార్గెట్‌ చేసి మాటా ్లడాలేకానీ మా అధినేత చంద్రబాబు, నారాలోకేశతో పాటు ఎవరినిపడితే వారిని ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదని, అన్నారు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడును మాట్లాడే స్థాయి నీకు లేదన్న విషయం గుర్తుకుపెట్టుకోవాలని హితవుపలికారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయరాదన్నారు. ఎంపీగా ఉన్న నీవు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు... అధికారం మారిన తరువాత ఇబ్బందులకు గురవుతావన్నారు.

 మాధవ్‌ నోరు అదుపులో పెట్టుకో..

టీడీపీ పార్లమెంట్‌ అధికారప్రతినిధి పురుషోత్తంగౌడ్‌

ధర్మవరంరూరల్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ విషయంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఖబడ్దార్‌ అంటూ టీడీపీ పార్లమెంట్‌ అధికారప్రతినిధి పురుషోత్తంగౌడ్‌ హెచ్చ రించారు. ఈ సందర్బంగా ఆయన ఆర్డీఓ కార్యాలయం ఎదుట నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ సహించే పరిస్థితి లేదన్నారు. ఇలాగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారని మండిపడ్డారు. 


Updated Date - 2022-08-12T05:57:06+05:30 IST