సైనిక డ్రోన్లను కూల్చే లేజర్ ఆయుధం కోసం ఇజ్రాయెల్ పరిశోధనలు

ABN , First Publish Date - 2021-06-22T04:42:33+05:30 IST

శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్లను కూల్చేందుకు ఇజ్రాయెల్ ఓ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోంది.

సైనిక డ్రోన్లను కూల్చే లేజర్ ఆయుధం కోసం ఇజ్రాయెల్ పరిశోధనలు

న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీల కారణంగా మిలిటరీ వ్యూహాల్లోనూ పలు స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. సంప్రదాయిక యుద్ధట్యాంకులు, వ్యూహాలకు ప్రాధాన్యం తగ్గుతుండగా డ్రోన్లే కేంద్రంగా వ్యూహాల రూపకల్పనకు అనేక దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్లను కూల్చేందుకు ఇజ్రాయెల్ ఓ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోంది. కేవలం డ్రోన్లే కాకుండా.. గాల్లోంచి దుసుకొచ్చే ఇతర ఆయుధాలను కూడా ఇది అడ్డుకోగలదని ఇజ్రాయెల్ చెబుతోంది. దీన్ని ప్రయోగించగానే.. డోన్ల ఉష్టోగ్రత విపరీతంగా పెరిగి అవి గాల్లోనే తగలబడి బూడిదైపోతాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. కేవలం సెకెన్ల వ్యవధిలోనే లక్ష్యాన్ని నాశనం చేయగలగడం ఈ లేజర్ ఆయుధం ప్రత్యేకత అని వారు అంటున్నారు. పలు మిసైళ్ల కదలికలను గమనిస్తూ వాటిని వేగంగా బుగ్గి చేయగల సత్తా ఈ కొత్త ఆయుధానికి ఉందట.

Updated Date - 2021-06-22T04:42:33+05:30 IST