Abn logo
Aug 2 2020 @ 11:17AM

ఐసిస్ ఖొరసాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అసదుల్లా ఒరక్‌జాయ్ ఖతం

కాబూల్ : ఐసిస్ ఖొరసాన్ శాఖ ఇంటెలిజెన్స్ చీఫ్ అసదుల్లా ఒరక్‌జాయ్‌ని ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అసదుల్లా పాకిస్థాన్ జాతీయుడు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్) ఈ వివరాలను తెలిపింది. 


ఎన్‌డీఎస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్, జలాలాబాద్ నగరానికి సమీపంలో జరిగిన టార్గెటెడ్ ఆపరేషన్‌లో అసదుల్లా హతుడయ్యాడు. ఐసిస్ ఖొరసాన్ శాఖకు అసదుల్లా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎన్‌డీఎస్ ప్రత్యేక బృందాలు అసదుల్లాను తుదముట్టించినట్లు ఈ ప్రకటన పేర్కొంది. 


ఆఫ్ఘనిస్థాన్‌లో సైన్యం, సాధారణ ప్రజలపై జరిగిన అనేక దాడులకు కుట్ర పన్నిన ఉగ్రవాది అసదుల్లా అని ఆఫ్ఘనిస్థాన్ మీడియా తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు మే నెలలో ఐసిస్ టాప్ కమాండర్ జియా ఉల్ హక్ వురపు అబు ఒమర్ ఖొరసానీ, మరో ఇద్దరు టాప్ డాయీష్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 


ఐసిస్ ఖొరసాన్ ఉగ్రవాది అబ్దుల్లా ఒరక్‌జాయ్, మరో 19 మంది ఉగ్రవాదులను ఎన్‌డీఎస్ ఏప్రిల్ 4న అరెస్టు చేసింది. 


Advertisement
Advertisement
Advertisement