ప్రభుత్వం గాడిదలు కాస్తోందా..?

ABN , First Publish Date - 2021-11-27T06:23:45+05:30 IST

రాష్ట్రంలో... మరీ ము ఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుం టే... వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాడిదలు కాస్తోందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

ప్రభుత్వం గాడిదలు కాస్తోందా..?
మర్తాడులో వర్షానికి నేలకొరిగిన వరి పంటను పరిశీలిస్తున్న సీపీఐ రామకృష్ణ, జిల్లా నేతలు

 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


అనంతపురం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో... మరీ ము ఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుం టే... వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాడిదలు కాస్తోందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం జి ల్లాకొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... వర్షాలు, వరదల నేపథ్యంలో... తమ పార్టీ నేతల బృందం రాయలసీమ జిల్లాల్లో పర్యటించిందన్నారు. గతంలో ఏనాడూ ఇంత విధ్వంసం జరగలేదన్నారు. ప్రాణ, ఆస్తుల నష్టం జరగడానికి ముమ్మాటికి మానవ తప్పిదమేనన్నారు. తిరుపతిలో కుంటలు, చెరువులు ఆక్రమించుకోవడంతోనే ఆస్తినష్టం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 60 మంది దాకా ప్రజలు చనిపోయారన్నారు. ఇసుక మాఫియా పర్యవసానం మూలంగానే ప్రజ లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కడప జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు కూడా అక్కడ పనిచేయలేదన్నారు. ఇందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కదిరిలో ఆరుగురు చనిపోవడానికి ప్రధాన కారణం ఆ మున్సిపాల్టీ టౌనప్లానింగ్‌ అధికారి అవినీతే కారణమన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారన్నారు. విశాఖపట్నంలో చనిపోతే రూ. కోటి అందజేసిన ముఖ్యమంత్రి ఆయన సొంత జిల్లా కడప, అనంతపురం జిల్లాలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడాన్ని ఏ వి ధంగా చూడాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అదే విధం గా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.25 వేలు పరిహారమివ్వాలన్నారు. రాష్ట్రం వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నా... ముఖ్యమంత్రి మాత్రం ప్యాలెస్‌ వదిలి రాకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్యాలెస్‌ వదిలి ప్రజల్లోకి రావాలని హితవు పలికారు. హెలిక్యాప్టర్‌లో గాల్లో తిరిగి రావడం కాదు... ప్రజల కష్టాలు, సమస్యలు వారి దగ్గరకెళ్లి చూడాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో జగన, చంద్రబాబులు కుటుంబాల పరువును పోగొట్టుకున్నారన్నారు. ఇకనుంచైనా పార్టీ నేతలను ఎవరికి వారు కంట్రోల్‌లో పెట్టుకొని గౌరవాన్ని కాపాడుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు హరినాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి జగదీష్‌, సహాయ కార్యదర్శులు జాఫర్‌, పి నారాయణస్వామి, కా ర్యదర్శివర్గసభ్యులు మల్లికార్జున, రాజారెడ్డి, వేమయ్య యాదవ్‌, నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గసభ్యులు టి నారాయణస్వామి, పి రామకృష్ణ, గోపాల్‌, నగర సహాయ కార్యదర్శులు అల్లీపీరా, రమణయ్య, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మనోహర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, రాజేంద్రయాదవ్‌, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి రాజే్‌షగౌడ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T06:23:45+05:30 IST