Flipkart Big Billion Daysకి ముందు బాంబు లాంటి వార్త.. వినియోగదారులపై ‘సరికొత్త ఛార్జీ’..?

ABN , First Publish Date - 2022-09-15T16:15:21+05:30 IST

Flipkart బిగ్ బిలియన్ డేస్.. పేరుతో బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించింది. దీంతో నెల రోజుల ముందే షాపింగ్ ప్రియులకు దసరా పండగ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బిలియన్ డే‌స్‌ సేల్స్ ప్రారంభానికి ముందు.. ఫ్లిప్‌కార్టు

Flipkart Big Billion Daysకి ముందు బాంబు లాంటి వార్త.. వినియోగదారులపై ‘సరికొత్త ఛార్జీ’..?

ఇంటర్నెట్ డెస్క్: Flipkart బిగ్ బిలియన్ డేస్..  పేరుతో బిగ్గెస్ట్ డిస్కౌంట్ సేల్స్‌ను ప్రకటించింది. దీంతో నెల రోజుల ముందే షాపింగ్ ప్రియులకు దసరా పండగ వాతావరణం  ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బిలియన్ డే‌స్‌ సేల్స్ ప్రారంభానికి ముందు.. ఫ్లిప్‌కార్టుకు సంబంధించిన ఓ బాంబు లాంటి వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీంతో  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. యూజర్ల ఆగ్రహానికి కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే..


దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని.. Flipkart ఏటా బిగ్ బిలియన్ డేస్‌ పేరుతో సేల్స్‌ను ఏటా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణ వస్తువులపై భారీ డిసౌంట్లు ఇస్తుంది. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా Big Billion Days సేల్స్‌ను ఈ నెల ప్రారంభంలోనే ప్రకటించింది. ఈ సేల్స్ సందర్భంగా ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక్కో కంపెనీ ఫోన్‌లపై ఆఫర్లను రివీల్ చేస్తూ యూజర్లను ఊరిస్తోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23-30 వరకు సేల్స్‌ను జరపనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించేసింది. దీంతో చాలా మంది యూజర్లు.. షాపింగ్ చేయడానికి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. 






ఈ నేపథ్యంలో Flipkart‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ ప్రకారం.. ఆర్డర్ చేసిన వస్తువులు ఇకపై ఫ్లిప్‌కార్టులో తిరిగి రిటర్న్ చేస్తే యూజర్ల జేబుకు చిల్లు పడుతుందట. ఆర్డర్ చేసిన పరికరాలు, బట్టలు తదితరాలు నచ్చకపోయినా, డ్యామేజీ ప్రాడక్ట్‌లు డెలివరీ అయినా.. ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకుండా Flipkart‌ ఫ్రీగా రిటర్న్ చేసే సౌకర్యం ఉండేది కదా. అయితే ఇప్పుడు దీనికి ఫ్లిప్‌కార్ట్ స్వస్తి పలికిందట. సంస్థలకు వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు.. ఇకపై రిటర్న్ సర్వీస్‌లపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించుకుందట. బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్.. తాజాగా ఫ్లిప్‌కార్టులో షాపింగ్ చేయడానికి ప్రయత్నించి.. రిటర్న్ సర్వీస్‌లపై ఛార్జీలు వసూలు చేస్తుందనే విషయాన్ని గుర్తించాడట. దీంతో వెంటనే అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ‘మూడేళ్లుగా నేను ఫ్లిప్‌కార్టు‌లో ప్లస్ మెంబర్‌ను. ఏటా 1.5లక్షల వరకు షాపింగ్ చేస్తాను. అయినా.. నేను ప్రాడక్ట్ రిటర్న్ చేస్తే.. నా నుంచి రిటర్న్ సర్వీస్‌కు ఛార్జీ చేస్తుందంట. డబ్బులు సంపాదించడానికి ఇదొక ట్రిక్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో సదరు యూజర్‌కు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.


ఈ క్రమంలో స్పందిస్తున్న కొందరు నెటిజన్లు Flipkart‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రిటర్న్ ఛార్జీలు అందరికీ అప్లై కావట్లేదని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎవరైతే ఫ్లిప్‌కార్టులో తరచూ రిటర్న్‌లు పెడతారో వారికి మాత్రమే ఈ ఛార్జీలు అమలవుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే.. Flipkart‌ మాత్రం రిటర్న్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.

Updated Date - 2022-09-15T16:15:21+05:30 IST