ఇసుక సరఫరాలో అక్రమాలు

ABN , First Publish Date - 2020-06-30T11:29:25+05:30 IST

ఇసుక ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నప్పటికీ రావడం లేదు. ముందు బుకింగ్‌ చేసుకున్న వారి కంటే వెనుక బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రం

ఇసుక సరఫరాలో అక్రమాలు

కోడేరు ఇసుక ర్యాంపు వద్ద వినియోగదార్ల ఆందోళన


ఆచంట, జూన్‌ 29: ఇసుక ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నప్పటికీ రావడం లేదు. ముందు బుకింగ్‌ చేసుకున్న వారి కంటే వెనుక బుకింగ్‌ చేసుకున్న వారికి మాత్రం సరఫరా అవుతోంది. ఇసుక సరఫరాలో అక్రమాలు, అధికారుల తీరుకు నిరసనగా ఇసుక వినియోగదారులు కోడేరు ఇసుక ర్యాంపు వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. పలువురు వినియోగదారులు ఆందో ళన అనంతరం ఆచంటలోని తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ర్యాంపు వద్ద పరిస్థితిని వివరించారు.


బుక్‌ చేసుకున్న వారి ఆందోళనతో స్పందించిన  రూరల్‌ సీఐ డి.వెంకటేశ్వరరావు ఎస్‌ఐ సీహెచ్‌.రాజశేఖర్‌, తహసీల్దార్‌ ఆర్‌వి కృష్ణారావు ర్యాంపు వద్దకు వెళ్లి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కొంతసేపు దగ్గరుండి ముందుగా బుక్‌ చేసుకున్న వారికి ఇసుకను పంపించారు. వరుస క్రమంలో ఇసుకను సరఫరా చేయాలని అక్కడ ఉన్న సిబ్బం దికి సూచించారు. ఇసుక సరఫరా విషయంలో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకున్న చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

Updated Date - 2020-06-30T11:29:25+05:30 IST