సాంఘిక సంక్షేమశాఖ బదిలీల్లో అక్రమాలు

ABN , First Publish Date - 2022-07-04T05:05:01+05:30 IST

సాంఘిక సంక్షేమశాఖ బదిలీల్లో అక్రమాలు

సాంఘిక సంక్షేమశాఖ బదిలీల్లో అక్రమాలు
సమావేశంలో మాట్లాడుతున్న మండెం సుధీర్‌కుమార్‌

రాయచోటి(కలెక్టరేట్‌), జూలై 3: సాం ఘిక సంక్షేమశాఖ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జరిగాయని దళిత హక్కుల పోరాట సమితి ఆరోపించింది. పట్టణంలో ని దళిత కుల పోరాట సమితి కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సమితి జిల్లా అధ్యక్షుడు మండెం సుధీర్‌ కుమార్‌ మాట్లాడు తూ, గత నెలలో జరిగిన వసతి గృహ అధికారుల బదిలీలు పారదర్శకంగా జరగలేదన్నారు. సీనియార్టీ ఆధారంగా కాకుండా, రాజకీయ నాయకుల పలుకు బడి, అంగబలం, అర్థబలం కలిగిన వారికి, వారు కోరుకున్న స్థానానికి బదిలీ చేశారన్నారు. బదిలీల్లో రాజకీయ నాయకుల జోక్యం కారణంగా జిల్లా సాంఘిక సంక్షేమశాఖకు చెందిన ఉన్నతాధికారి చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. తక్షణమే బదిలీలను రద్దు చేసి అవినీతి అక్రమాలపై విచారణ చేయడంతో పాటు, కలెక్టర్‌ స్వయంగా బదిలీల ప్రక్రియను పర్యవేక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్‌ నాయకులు సుధాకర్‌, రెడ్డెయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:05:01+05:30 IST