శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త.. అసలేం జరిగిందంటే?..

ABN , First Publish Date - 2022-05-29T09:28:16+05:30 IST

ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. విచిత్రం ఏమిటంటే అతను కాసేపటి వరకు బాగానే ఉన్నాడు. తన భార్యతో శృంగారంలో కూడా పాల్గొన్నాడు. ఒక్కసారిగా ఇంతకుముందు ఏం జరిగింది?.. నిన్నటి రోజు ఏం జరిగింది? అంటూ కుటుంబ సభ్యలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతడిని పరీక్షించిన .. మానసిక వైద్య నిపుణులు...

శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే జ్ఞాపక శక్తి కోల్పోయిన భర్త.. అసలేం జరిగిందంటే?..

ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. విచిత్రం ఏమిటంటే అతను కాసేపటి వరకు బాగానే ఉన్నాడు. తన భార్యతో శృంగారంలో కూడా పాల్గొన్నాడు. ఒక్కసారిగా ఇంతకుముందు ఏం జరిగింది?.. నిన్నటి రోజు ఏం జరిగింది? అంటూ కుటుంబ సభ్యలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతడిని పరీక్షించిన .. మానసిక వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. 


వివరాల్లోకి వెళితే.. ఐర్లాండ్ దేశానికి చెందిన ఒక 66 ఏళ్ల వ్యక్తి తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తరువాత తన జ్ఞాపక శక్తి కోల్పోయాడు. శృంగారం తర్వాత అతను తన ఫోన్ చూసుకున్నాడు. అందులో ఆ రోజు డేట్ చూసి షాక్ అయ్యాడు. అయ్యో!.. ఒక రోజు ముందే తన పెళ్లి రోజు గడిచిపోయిందని.. దానిని సెలెబ్రేట్ చేసుకోలేదని బాధపడ్డాడు. నిజానికి అతను అంతకు ముందటి రోజు తన వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అదంతా మరిచిపోయాడు. అంతేకాదు అదే రోజు ఉదయం ఏం జరిగిందో కూడా అతనికి గుర్తుకు రావడంలేదు. ఉదయం తాను ఏం చేశాను.. ఎక్కడున్నానని భార్యను ప్రశ్నించాడు. ఇదంతా చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. చివరికి అతనికి మానసికంగా ఏదో సమస్య ఉందని గుర్తించి వైద్యులను సంప్రదించారు.


ఈ ఘటన గురించి ఐరిష్ మెడికల్ జర్నల్ పరిశోధన చేసి ఓ పరిశోధనాత్మక కథనాన్ని ఇటీవల ప్రచురించింది. ఈ కథనంలో వైద్య నిపుణులు ఈ ప్రమాదాన్ని ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నేసియా (టీజీఏ) అని తెలిపారు. తన భార్యతో రతి జరిపిన తర్వాత పది నిమిషాలకే ఆ ఐరిష్ వ్యక్తి జ్ఞాపక శక్తిని కోల్పోయాడని, తన భార్య, కూతురిని పదే పదే చిన్న చిన్న విషయాల గురించి ఆరా తీశాడని ఆ కథనం పేర్కొంది.


ఇలాంటి స్థితి ఎక్కువగా 50 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య గలవారిలో ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ స్థితిలో సదరు మనిషి రీసెంట్‌గా జరిగిన విషయాలు అన్నింటిని మరిచిపోతుంటాడని వివరించారు. కొంత మందికి ఏడాది క్రితం జరిగిన షయాలు కూడా మరిచిపోతుంటారని తెలిపారు. అయితే, ఈ టీజీఏతో అఫెక్ట్ అయినవారు మరిచిపోయిన విషయాలను కొంత కాలం తర్వాత అంటే తక్కువ వ్యవధిలోనే మళ్లీ తిరిగి పొందుతారని వివరించారు. అయితే ఇలాంటి కేసుల్లో జ్ఞాపక శక్తి కోల్పోయిన వారు తమ గుర్తింపుని మాత్రం కోల్పోరని చెప్పారు. తమ పేరు, వయసు, ఇతర ప్రాథమిక విషయాలను గుర్తుంచుకుంటారని వివరించారు.


ప్రస్తుత కేసులో సదరు ఐరిష్ వ్యక్తి ఇంతకుముందు 2015లో కూడా ఇలాగే జ్ఞాపక శక్తిని కోల్పోయాడని.. అప్పుడు కూడా తన భార్యతో శృంగారం జరిపిన తరువాతనే అలా జరిగిందని తెలిసింది. అయితే అప్పుడు అతనికి త్వరగానే మళ్లీ అన్నీ గుర్తుకు వచ్చాయని అతని భార్య తెలిపింది.


టీజీఏకు లోనయ్యే పది శాతం మంది మళ్లీ ఆ సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్పారు. ఫిజికల్ యాక్టివిటీ, చల్లని లేదా వేడైన నీటిలో మునిగినప్పుడు, భావోద్వేగానికి లోనైనప్పుడు, స్ట్రెస్‌గా ఉన్నప్పుడు, బాధ, సంభోగం వంటి చర్యలు చేసిన తర్వాత టీజీఏకు లోనవుతూ ఉంటారని పరిశోధనాత్మక కథనం తెలిపింది. టీజీఏ కారణంగా మెమోరీ లాస్ కాదని, కొద్ది సేపు జ్ఞాపక శక్తిని కోల్పోతామని, మళ్లీ గతాన్ని గుర్తు చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. 



Updated Date - 2022-05-29T09:28:16+05:30 IST