జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా దినకర్ గుప్తా

ABN , First Publish Date - 2022-06-24T02:55:30+05:30 IST

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా నియమితులయ్యారు

జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్‌గా దినకర్ గుప్తా

న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తా (Dinkar Gupta) నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుప్తా పంజాబ్ కేడర్‌కు చెందినవారు. 31 మార్చి 2024.. అంటే ఆయన పదవీ విరమణ తేదీ వరకు గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.


అలాగే, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) స్పెషల్ డైరెక్టర్ స్వాగత్ దాస్‌ (Swagat Das)ను హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమించింది. స్వాగత్ దాస్ 1987 బ్యాచ్ చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన వారు. 30 నవంబరు 2024 లేదంటే, ఆయన పదవీ విరమణ వరకు, లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. 

Updated Date - 2022-06-24T02:55:30+05:30 IST