Abn logo
Apr 15 2021 @ 23:50PM

దరఖాస్తుల ఆహ్వానం

జైనథ్‌, ఏప్రిల్‌15: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ జావిద్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో తెలపారు. ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేసన్‌ వెల్లడించిన నేపథ్యంలో జైనథ్‌ ఆదర్శ పాఠశాలలో గల 6వ తరగతిలో వంద సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు వెకెన్సి ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. 6వ తరగతిలో చేరబోయే విద్యార్థులు ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలన్నారు. దీంతో పాటు ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. 6వ తరగతి వారికి 06-06-2021తో పాటు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. 

Advertisement
Advertisement